-
ఆడబిడ్డలందరికీ ఎంగిలిపూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు
-
వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నాగరాజు
పర్వతగిరి, సెప్టెంబర్ 21 (ప్రజాజ్యోతి):
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకైన బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రజలు అందరూ సంతోషంగా జరుపుకోవాలని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆకాంక్షించారు. తెలంగాణ అస్తిత్వానికీ, సాంస్కృతిక జీవనానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర, నియోజకవర్గ ఆడబిడ్డలకు ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.