- అంగన్వాడీ టీచర్ల ముందస్తు అరెస్టు
పర్వతగిరి, సెప్టెంబర్ 15 (ప్రజాజ్యోతి)
అంగన్వాడి టీచర్లు, ఆయాల ప్రధాన డిమాండ్లను సాధించాలని సంకల్పంతో మంత్రి కొండా సురేఖ కార్యాలయాన్ని ముట్టడించాలని అంగన్వాడి టీచర్ల రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు పర్వతగిరి మండల కేంద్రం నుండి బయలుదేరిన అంగన్వాడి టీచర్లను పర్వతగిరి పోలీసులు మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సులో సోమవారం ఉదయం అరెస్టు చేశారు. అంగన్వాడి వర్కర్ల హక్కుల సాధన కోసం తాము చేపట్టిన తమ హక్కుల కోసం ఎలాంటి అడ్డంకులు ఎదురైనా ఆపేది లేదని, తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.