* క్రమశిక్షణతో చదువుకుని లక్ష్యాలను చేరుకోవాలి
* సహాయ ప్రధానోపాధ్యాయురాలు సమీరా నజ్నీన్
నర్సాపూర్ (ప్రజాజ్యోతి) విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సహాయ ప్రధానోపాధ్యాయురాలు సమీరా నజ్నీన్ పేర్కొన్నారు. మండల పరిధిలోని పెద్ద చింతకుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రధానోపాధ్యాయుడు ప్రొఫెసర్ హుస్సేన్ మార్గదర్శకాన, సమీరా నజ్మీన్ ఆధ్వర్యంలో గురువారం ప్రెషర్స్ డే సంబరాలు నిర్వహించారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు రెండవ సంవత్సరం విద్యార్థులు స్వాగతం పలుకుతూ ఘనంగా ఫ్రెషర్స్ డే సంబరాలు వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ,నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆడెప్ప, సురేష్ కుమార్, హేమంత్, మహేందర్, రాజు, రాములు, జానకి, గణేష్, చంద్రమౌళి, యాదగిరి, చంద్రకళ, అపర్ణ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.