* రోడ్డెక్కిన రైతన్నలు
నర్సాపూర్ (ప్రజాజ్యోతి) గంటల తరబడి వేచి చూసిన రైతులకు ఒక బస్తా యూరియా కూడ దొరకక పోవడం గగనమైంది. నర్సాపూర్ పట్టణ కేంద్రం రైతు వేదిక వద్ద అన్నదాతలు ఉదయం 6 గంటల నుండి యూరియా బస్తాల కొరకు వేచి చూసి నిరీక్షించారు. దీంతో జాతీయ రహదారి 765 డి పై రాస్తారోకో చేపట్టగా, సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. రైతన్నలు రాస్తారోకోను విరమించుకుని రైతు వేదిక వద్ద బారులు తీరారు. ఏవో దీపిక సంబంధిత అధికారూలతో మాట్లాడి రేపటి లోపు మూడు లారీలలోడు యూరియా బస్తాలను పంపిణీ చేస్తామని చెప్పారు.
