చేవెళ్ల రచ్చబండ లడ్డు 16 లక్షలు
లడ్డు వేలం పాటలో దక్కించుకున్న అత్తెలి బ్రదర్స్
చేవెళ్ల సెప్టెంబర్ 06(ప్రజా జ్యోతి):
చేవెళ్లలో కొలువైన రచ్చబండ వినాయకుని లడ్డు వేలంపాట పోటాపోటీగా కొనసాగింది. 11 రోజులపాటు విశిష్ట పూజలు అందుకున్న రచ్చబండ వినాయకుని లడ్డును అత్తెలి బ్రదర్స్ 1611001 రూపాయికి దక్కించుకున్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు అత్తిలి బ్రదర్స్ కు లడ్డును అందజేశారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులు వారి కుటుంబం పై ఉండాలని ప్రజలంతా సంతోషంతో ఉండాలని ఉత్సాహ కమిటీ సభ్యులు ఆకాంక్షించారు. లడ్డూ వేలం పాటలో వివిధ గ్రామాల ప్రజలు చేవెళ్ల ప్రజలు భారీగా పాల్గొన్నారు.