సూర్యాపేట జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 05(ప్రజాజ్యోతి): సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నల్లాల బావి చౌరస్తా వద్ద మార్గదర్శి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల 25వ వార్షికోత్సవం సందర్భంగా నెలకొల్పిన వినాయకుని విగ్రహం వద్ద గత తొమ్మిది రోజులుగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.శుక్రవారం నిర్వహించిన స్వామి వారి లడ్డు వేలం పాటలో తెనాలికి చెందిన గొట్టిముక్కల మహేష్ బాబు యూకే నుండి ఆన్ లైన్ ద్వారా లడ్డూ వేలం పాటలో పాల్గొని రూ.72116కు స్వామివారి లడ్డూను దక్కించుకున్నారు.ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు నేరెళ్ల మధు గౌడ్, అధ్యక్షులు సలిగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన దాతలకు, మార్గదర్శి యూత్ క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.గత 25 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.విఘ్నాలను తొలగించే గణనాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని అన్నారు.అనంతరం గణేశుని నిమజ్జన శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సభ్యులు కారింగుల వేణు, నేరెళ్ల నరేష్, కొండా రాజేష్, గుణగంటి మధు, పోలగాని ఉపేందర్, గోపగాని గిరి, పొదిల హరి, నేరెళ్ల మిథున్ సాయి, జానయ్య, రామినేని శ్రీను, దోరేపల్లి సైదులు, మద్దెల ఫణి, సలిగంటి నాగయ్య, భూక్య రాజు, చెరుకు రవి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.