సూర్యాపేట జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 03(ప్రజాజ్యోతి): అన్నదానం మహాదానమని అన్నం పరబ్రహ్మ స్వరూపమని పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పం శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని రెడ్ బకెట్ ఎదురు సందులో ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పట్టణ పద్మశాలి యువజన సంఘం నాయకులు బాల్నె క్రాంతి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. కులాలకు మతాలకు అతీతంగా లంభోదరుని నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవడం అభినందనీయమన్నారు. గణేశుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి చల్లమల్ల నరసింహ, పద్మశాలి యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మిట్టకోల యుగంధర్,మిట్టకోల ఉపేందర్, పట్టణ క్లాత్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్, మాజీ కౌన్సిలర్ లు గండూరి పావని, గండూరి రమేష్,పట్టణ పద్మశాలి సంఘం కార్యదర్శి యలగందుల సుదర్శన్, దూలం నగేష్,ఏల్లె సత్యనారాయణ, కడారి భిక్షం, పున్న వెంకన్న, చిలువేరు నరసింహారావు, యెన్నం ఉమేష్, తదితరులు పాల్గొన్నారు.