యువకులకు ఎస్పి సన్మానం
రామారెడ్డి సెప్టెంబర్ 2 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండల కేంద్రంలో కురిసిన భారీ వర్షాలకు రామారెడ్డి నుండి కా మారెడ్డి వెళ్లే రహదారి జలమయం అవడంతో కొందరు ప్రయాణికులు ఇబ్బందులతో తమ గమ్యస్థానాలకు చేరుకునే ప్రయత్నంలో కొండాపూర్ గ్రామానికి చెందిన టాటా ఏసీ ఒక బైకు, అదేవిధంగా ఆరుగురు వరదల్లో చిక్కుకున్నారు. ఓ టీవీఎస్ ఎక్సెల్ వాహనదారుడు కూడా వరద వృద్ధికి నీటిలోకి జారి వెళ్లడం జరిగింది. వారిని కాపాడిన రెస్క్విటీఎం, వారికి అభినందనలు తెలిపిన జిల్లా ఎస్పీ అదే విధంగా భారీ వర్షంలో పోలీస్ వారికి సహకరించిన రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన ఇద్దరు యువకులు ఎఎంసి డైరెక్టర్ రావుఫ్,లక్కాకుల శేఖర్ జేసీబీ,లకు ఎస్పీ అభినందనలు తెలుపుతూ సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది, స్థానిక ఎస్సై లావణ్య తదితరులు పాల్గొన్నారు.
