అన్నిదానాల్లో అన్నదానం గొప్పది 43వ వార్డు నెహ్రూ నగర్ లో ఘనంగా అన్నదాన కార్యక్రమం

Nalgonda Bureau
1 Min Read

సూర్యాపేట జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 01(ప్రజాజ్యోతి):అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని మాజీ కౌన్సిలర్,మాజీ మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ బత్తుల ఝాన్సీ రమేష్ అన్నారు.జిల్లా కేంద్రంలోని 43వ వార్డ్ నెహ్రూ నగర్ లో మాజీ కౌన్సిలర్ బత్తుల ఝాన్సీ రమేష్ సౌజన్యంతో జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల 37వ వార్షికోత్సవం సందర్భంగా నెలకొల్పిన వినాయకుని విగ్రహం వద్ద సోమవారం డాక్టర్ కందుల శ్రీరామ్ కుమార్ స్రవంతి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 37 సంవత్సరాలుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ప్రతి ఒక్కరూ వినాయక చవితి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నారు.ఆ గణనాథుని దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కులమతాలకు అతీతంగా వార్డు ప్రజలందరూ ఈ వేడుకల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు.ఉత్సవ కమిటీ వారికి సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాతలు మట్టపల్లి లింగయ్య సత్యవతి, యాపాల వెంకటరెడ్డి అరవింద, బత్తుల కౌసల్య దశరథ, మహమ్మద్ రఫీ కరీమున్నీసా బేగం, పటేల్ వంశీకృష్ణారెడ్డి, మాందాసు కిరణ్ గౌడ్ లక్ష్మి, బత్తుల వెంకటరాజు రమణమ్మ, సుంకర సందీప్ శ్రావణి, పర్వీన్ బేగం, సభ్యులు బత్తుల నాగరాజు, మెకానిక్ మస్తాన్, వెంకన్న, రఘు, శ్రీనివాస్, లింగయ్య, రమణి, రమణ, ప్రమీల, నిర్మల, రేణుక తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *