గామా పురస్కారాలు… బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్

V. Sai Krishna Reddy
2 Min Read

టాలీవుడ్‌కు ప్రత్యేక గౌరవాన్ని తెచ్చే గామా (Gulf Academy Movie Awards) 2025 వేడుక ఈ సంవత్సరం ఎంతో ఘనంగా జరిగింది. కెయిన్ ఫ్రా ప్రాపర్టీస్ అండ్ వైభవ్ జ్యువెలర్స్ సమర్పణలో దుబాయిలోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో ఈ 5వ ఎడిషన్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అనేకమంది ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు.

ఈ సంవత్సరం గామా అవార్డ్స్‌లో “పుష్ప 2: ది రూల్” సినిమా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రం ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు సహా నాలుగు ప్రధాన అవార్డులను సొంతం చేసుకుంది.
“పుష్ప 2″లో తన అద్భుత నటనకుగాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డును గెలుచుకున్నారు. దర్శకుడు సుకుమార్ ఉత్తమ దర్శకుడిగా అవార్డును అందుకున్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసినందుకు ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డును పొందారు.

గామా అవార్డు గ్రహీతలు:

గామా ఉత్తమ చిత్రం 2024 – పుష్ప 2 ది రూల్ (మైత్రీ మూవీ మేకర్స్, యలమంచిలి రవి, నవీన్ యెర్నేని)
ఉత్తమ నటుడు – అల్లు అర్జున్ (పుష్ప 2)
ఉత్తమ నటి – మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ దర్శకుడు – సుకుమార్ (పుష్ప 2)
ఉత్తమ సంగీత దర్శకుడు – దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప 2)
ఉత్తమ నిర్మాతలు – అశ్వినీ దత్, ప్రియాంక దత్, స్వప్న దత్ (కల్కి 2898AD)

సంగీత విభాగాల్లో గెలుచుకున్న వారు:

నేపథ్య గాయకుడు (పురుషులు) – అనురాగ్ కులకర్ణి (గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి)
నేపథ్య గాయని (మహిళలు) – మంగ్లీ (ఫ్యామిలీ స్టార్)
గీత రచయిత – రామజోగయ్య శాస్త్రి (దేవర)

ప్రత్యేక పురస్కారాలు:

జీవిత సాఫల్య పురస్కారం – అశ్వినీ దత్
గ్లోబల్ కమెడియన్ అవార్డు – బ్రహ్మానందం
ఫ్యాన్స్ ఫేవరెట్ స్టార్ – ఊర్వశీ రౌటెలా
ప్రామిసింగ్ యాక్టర్ – సత్యదేవ్ (జీబ్రా)

రైజింగ్ టాలెంట్ గుర్తింపు:

ఉత్తమ డెబ్యూ దర్శకుడు – యదు వంశీ (కమిటీ కుర్రాళ్ళు)
ఉత్తమ డెబ్యూ నటి (ఫిమేల్) – నయన్ సారిక (ఆయ్, క)
ప్రామిసింగ్ యంగ్ యాక్టర్స్ – రోషన్, శ్రీదేవి, మానస వారణాశి
ఈ కార్యక్రమానికి ఏ. కోదండరామిరెడ్డి, బి. గోపాల్, కోటి వంటి ప్రముఖులు జ్యూరీ చైర్‌పర్సన్స్‌గా వ్యవహరించడం విశేషం.
గామా అవార్డ్స్ ద్వారా కొత్త టాలెంట్‌కు గుర్తింపు లభించడమే కాకుండా, టాలీవుడ్ స్థాయి అంతర్జాతీయంగా మరింత పెరుగుతోందనడానికి ఈ వేడుక ఒక సూచనగా నిలిచింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *