పుట్టగొడుగుల్లా కన్సల్టెన్సీ లు..!!
* రోజుకో పేరుతో పుట్టుకొస్తున్నాయి*
* యూనివర్సిటీ ల పేరుతొ దొంగ సర్టిఫికెట్లు..!
* ఫేక్ వ్యవహారంలో మూత పడి మల్లి తెరుసుకుంటున్న పలు సంస్థలు
* కాపాడిన వారెవరూ..?
వరంగల్ / ప్రజాజ్యోతి :
వరంగల్ ఉమ్మడి జిల్లాలో పుట్టగొడుగుల్లా ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ లు పుట్టుకొస్తున్నాయి. విదేశాలకు పంపే కోణంతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎర వేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. గతంలో దేశంలోని 30 యూనివర్సిటీల కు సంబందించిన ఫేక్ సర్టిఫికెట్టులను తయారు చేసిన ముఠాను వరంగల్ టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో ఎన్నో విస్తు పోయే విషయాలు బయటపడ్డాయి. సొంత కుటుంబంలోని కొందరిని విదేశాలకు పంపిన సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ఫేక్ వ్యవహారంలో మూత పడి.. మల్లి తెరుసుకుంటున్న పలు సంస్థలు తెరమీదకి వస్తున్నాయి. ఆ సమయంలో పలువురు ముఖ్యుల సహకారంతో ఫేక్ ముఠా నుండి బయటపడిన కొన్ని సంస్థలు తిరిగి తెరమీదకి రావటంలో ప్రజలు విస్తుపోతున్నారు. అంతటి కుంభకోణంలో అధికారుల తీరుతో ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ వ్యవహారంలో కొన్ని సంస్థలను కాపాడిన వారు ఎవరు..?? అనేది ఇప్పుడు సామాన్యు ప్రజల మధ్య చర్చనీయాంశంగా మారింది.!!.



