పునరావాస బాధితులకు ఆహారం అందజేత
— ఎంపీడీవో నాగేశ్వర్
రామారెడ్డి ఆగస్టు 28 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండల కేంద్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలైన
వరద బాధితుల కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి అందుబాటులో వైద్యం, అదేవిధంగా మంచినీటి సౌకర్యం, ఆహారం అందజేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా గురువారం రామరెడ్డి నుండి సదాశినగర్ వెళ్లే రహదారి వరద వృద్ధితి వలన రాకపోకలు సాయంకాలం వరకు నిలిచిపోయాయి.ఎర్ర కుంట వాగు తెగిపోయి నిర్వాసితుల కుటుంబాలకు నివాసం మరియు భోజన వసతి కల్పించడం జరిగింది. ఇసన్నపల్లి గ్రామపంచాయతీ పరిధిలో భోజన సదుపాయాలను ఏర్పాటు చేశారు.రామారెడ్డి మండల కేంద్రంలోని ఎస్సీ భవనంలో మండల కేంద్రంలో పునరావాస బాధితులకు సంబంధించిన అన్ని సదుపాయాలు కల్పించడం జరిగిందని మండల ఎంపీడీవో నాగేశ్వరరావు తెలిపారు.
