ఓటరు లిస్టులో మీ పేరు ఉందా.. చెక్ చేసుకోండి..
వరంగల్ / ప్రజాజ్యోతి::
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) పంచాయతీల పరిధిలో ఓటరు జాబితా సవరణ, తుది ఓటరు జాబితా వెల్లడికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రామపంచాయతీల పరిధిలో తుది ఓటరు జాబితా సిద్ధం చేసేందుకు, పోలింగ్ కేద్రాల ఎంపిక, వాటి నిర్వహణకు తేదీలను నిర్ణయిస్తూ నోటిఫై చేసిన అన్ని గ్రామపంచాయతీల్లో ఫొటో ఓటర్ల జాబితాను ఈ రోజున (28న) గ్రామపంచాయతీ, మండల పరిషత్ కార్యాలయాల్లో ముసాయిదా ఓటరు జాబితాను, పోలింగ్ కేంద్రాల సమాచారాన్ని ప్రదర్శిస్తారు. ఈ రోజు నుంచి 30వ తేదీ వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించి 31న వాటిని పంచాయతీలు, వార్డుల వారీగా గ్రామాల్లో ప్రదర్శిస్తారు. అనంతరం సవరించిన తుది ఓటరు జాబితాను సెప్టెంబరు 2న విడుదల చేస్తారు..


