హైదరాబాద్ నగరాన్ని గురువారం ఉదయం వర్షం పలకరించింది. తెల్లవారుజాము నుంచే నగరంలోని అనేక ప్రాంతాల్లో చిరుజల్లులతో మొదలై, ఆ తర్వాత క్రమంగా వాన పుంజుకుంది. నగరంలోని ప్రధాన ప్రాంతాలైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, మాసబ్‌ట్యాంక్, లక్డీకపూల్ వంటి చోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. అలాగే ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేటలోనూ వాన పడింది.
ఈ వర్షంతో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ఉదయం పూట ట్రాఫిక్‌కు స్వల్ప అంతరాయం ఏర్పడింది. కాగా, బుధవారం రాత్రి కూడా నగరంలోని పలు ప్రాంతాలు వర్షంతో తడిసి ముద్దయ్యాయి. ముఖ్యంగా హయత్‌నగర్, వనస్థలిపురం, ఉప్పల్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట సహా మరికొన్ని చోట్ల వర్షపాతం నమోదైంది. వరుసగా కురుస్తున్న ఈ వర్షాలతో నగర వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది