ఆసక్తికర జాబ్ నోటిఫికేషన్… స్క్రోలింగ్ చేయడమే ప్రధాన అర్హత

V. Sai Krishna Reddy
1 Min Read

సోషల్ మీడియాలో గంటల తరబడి స్క్రోల్ చేస్తూ గడిపే యువతకు ఇది ఓ శుభవార్త. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటివాటిలో ఎక్కువ సమయం గడిపే వాళ్లకోసం ప్రత్యేకంగా ఒక ఉద్యోగ ప్రకటన విడుదలైంది. మాంక్ ఎంటర్‌టైన్‌మెంట్ కో-ఫౌండర్ మరియు సీఈఓ విరాజ్ శేత్ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఉద్యోగానికి ‘డూమ్-స్క్రోలర్’ అనే పేరు పెట్టారు. రోజు కనీసం ఆరు గంటలు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో స్క్రోల్ చేసే నైపుణ్యం ఉండాలి. కేవలం అలవాటుగా కాకుండా, ట్రెండ్స్‌ను అర్థం చేసుకునే దక్షత ఉండాలని విరాజ్ శేత్ పేర్కొన్నారు.

అర్హతలు:

హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నైపుణ్యం తప్పనిసరి
సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ పట్ల ఆసక్తి మరియు అవగాహన
క్రియేటర్ కల్చర్ పట్ల అంకితభావం
మైక్రోసాఫ్ట్ ఎక్సెల్‌ వాడగలగాలి
ఉద్యోగం ముంబైలో ఉంటుంది; ఫుల్ టైం విధానంలో పనిచేయాలి

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్టుపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. “ఇన్‌స్టాలో సమయం వృధా చేస్తున్నాననుకున్నా, ఇప్పుడు అదే స్కిల్!” అంటూ కొందరు కామెంట్ చేయగా, “నేను 19 గంటలు స్క్రోల్ చేస్తా, ఈ ఉద్యోగానికి పర్ఫెక్ట్ కాదా?” అంటూ మరికొందరు స్పందిస్తున్నారు. ఇంకొందరు అయితే “ఇది మా అమ్మకి చూపించాలి, స్క్రోలింగ్ కూడా ప్రొఫెషన్ అవుతుంది!” అంటూ సరదాగా రిప్లై ఇస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *