బండరాయితో మోది.. భార్యను చంపిన భర్త
సదాశివనగర్ ఆగస్టు 23 (ప్రజాజ్యోతి)
భార్యను బండరాయితో మోది భర్త హత్య చేసిన సంఘటన సదాశివనగర్ మండల కేంద్రంలో జరిగింది. పోలీసు తెలిపిన వివరాల ప్రకారం.. సదాశివనగర్ మండల కేంద్రంలోని జ్యోతి నగర్ కాలనీకి చెందిన చిందం లక్ష్మి (40) ని ఆమె భర్త చిందం రవి శుక్రవారం రాత్రి హత్య చేశాడు. రవి మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. భార్య వంట చేస్తుండగా దంపతుల మధ్య తగువు చోటుచేసుకుంది. ఆ సమయంలో భార్య భర్తను కొట్టిన కారణంగా కోపానికి గురైన భర్త రవి సమీపంలో ఉన్న బండరాయితో భార్య పై దాడి చేయగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు సురేష్, మహేష్ లు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి సీఐ సంతోష్ కుమార్, క్లూస్ టీం ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని శవ పంచనామ కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
