మొన్న ఎమ్మెల్యే నేడు ఎంఈఓ ఆకస్మిక తనిఖీ: ఉపాధ్యాయుల్లో గుబులు.
భిక్కనూరు ఆగస్టు 22 (ప్రజా జ్యోతి)
భిక్కనూరు మండలంలోని ఖాచాపూర్ మండల ప్రాథమిక పాఠశాల ను శుక్రవారం ఉదయం విరామ సమయం తర్వాత మండల విద్యాధికారి రాజగంగారెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు.ఇందులో భాగంగా మూడు, నాలుగు, ఐదు తరగతుల విద్యార్థుల తెలుగు, గణితం, ఆంగ్ల ,సామర్థ్యాలను పరీక్షించడం జరిగింది . కొంతమంది విద్యార్థులు అడిగిన దానికి సరైన సమాధానం చెప్పకపోవడంతో, ఉపాధ్యాయుల పట్ల అసహనం వ్యక్తం చేశారు.విద్యార్థుల లో నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఉపాధ్యాయులు పాటిస్తున్న కార్యచరణను, రికార్డులను పరిశీలించి, అవసరమైన సూచనలు చేయడమైనది.ఇందులో భాగంగా తరగతి గదిలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో తరగతికి విద్యార్థులే బిందువు అని, వారిని ప్రతిరోజూ పాఠశాలకు వచ్చేలాగా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని, బడి బయట ఉన్న పిల్లలను అవగాహన కల్పించి పాఠశాలలో చేర్పించాలని హెచ్చరించారు. అదేవిధంగా గత వారం మండలంలోని ఇస్సన్నపల్లి, పెద్ద మల్లారెడ్డిలలో ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేసిన విషయం తెలిసిందే ,అదే విధంగా నేడు ఎంఈఓ రాజగంగారెడ్డి ఆకస్మిక తనిఖీతో ప్రభుత్వ పాఠశాలలోని సిబ్బంది ఉలిక్కిపడుతున్నారు.ఇలా ఎప్పటికప్పుడు విద్యాసంస్థలను పర్యవేక్షించడం వల్ల ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో మళ్ళీ ఆశలు చిగురిస్తున్నాయి అని, అదేవిధంగా ప్రైవేటు విద్యాసంస్థల ఫీజు బారాన్ని తగ్గించినట్టే అని అభిప్రాయపడుతున్నారు. దాంతోపాటు నిరక్షరాస్యతను వీలైనంత త్వరగా దూరం చేయొచ్చు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.
