బీఆర్ఎస్ నాయకులు
నాగిరెడ్డిపేట్,ఆగష్టు22(ప్రజాజ్యోతి):
నాగిరెడ్డిపేట్ మండలంలో మంజీరా నది పరిహాక ప్రాంతంలో గత ఆరు రోజులుగా పంట పొలాలు నీటిలో మునిగి ఉన్నాయని, దీంతో రైతులకు భారీ పంట నష్టం జరిగిందని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. శుక్రవారం బంజారా వద్ద నీట మునిగిన పంటలను వారు సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వంకు రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని,వరదలు వచ్చి ఆరు రోజులైనా పంటలు నీటిలోనే మునిగివుంటే, ముంపు నుంచి పంటలు బయటకు రాకున్నా కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేయడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.రైతుల పంట పొలాలు నీటిలో మునిగి ఉంటే కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారని, గతంలో ఇంతకన్నా భారీ వరదలు వచ్చినపుడు భిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ స్థానికంగా ఉండి నిజాంసాగర్ జలాశయం వద్ద బైఠాయించి నీటిని విడుదల చేయించి రైతులను,పంటలను కాపాడని ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గుర్రాల సిద్దయ్య, మాజీ జెడ్పిటిసి ఉమన్నగారి మనోహర్ రెడ్డి, నాయకులు రాజీరెడ్డి, వంశీ గౌడ్ హన్మంత్ రెడ్డి లక్ష్మీకాంతం, ఫరీద్, సాయిలు తదితరులు పాల్గొన్నారు