నాగిరెడ్డిపేట్,ఆగస్టు22(ప్రజాజ్యోతి):
నాగిరెడ్డిపేట మండలంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జాతర పనుల్లో భాగంగా వివిధ గ్రామాలలో రూ.38 లక్షల 60 వేల నిధులతో వివిధ అభివృద్ధి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు ఎంపీడీఓ ప్రభాకర్ చారీ తెలిపారు. అనంతరం పనుల జాతర కార్యక్రమంలో ఆయా గ్రామాల్లో పారిశుధ్య కార్మికులు,ఎక్కువ పని దినాలు ఉన్న ఉపాధి హామీ కూలీలను సత్కరించారు.ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి ఇంద్రసేన్, ఏపీ గ్రామ పంచాయతీ కార్యదర్శులు, గ్రామ నాయకులు సాయిలు నిర్వహించారు.