గాంధారి, ఆగస్టు 22(ప్రజాజ్యోతి)
హైదరాబాద్‌లో గురువారం రాష్ట్ర లాభనా అధ్యక్షులు తాన్ సింగ్ నాయక్, కమిషనర్ చెల్లప్ప నివాసంలో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు రిజర్వేషన్ విధానాలు, వాటి అమలుపై చర్చించారు.లాభనా సమాజ అభివృద్ధికి రిజర్వేషన్లు ఎంత ముఖ్యమో తాన్ సింగ్ నాయక్ వివరించారు. సమాజంలోని సమస్యలు, భవిష్యత్ అవకాశాలపై కమిషనర్‌కు సూచనలు, సలహాలు అందించినట్లు ఆయన తెలిపారు. త్వరలో మరిన్ని చర్యలు చేపట్టేందుకు చర్చ జరిగిందని కూడా వెల్లడించారు.