గాంధారి, ఆగష్టు 20 (ప్రజాజ్యోతి)
గాంధారి మండలం, గుర్జల్ తాండకు చెందిన బస్సి మంగళ్ చంద్ ఇటీవల మృతి చెందగా, లాభానా సమాజ్ నాయకులు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే, లాభానా సమాజ్ అధ్యక్షులు తాన్ సింగ్ నాయక్, ఇతర నాయకులతో కలిసి మృతుని కుటుంబాన్ని సందర్శించారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇస్తూ, ఈ కష్ట సమయంలో తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా లాభానా అధ్యక్షులు మంజ బంతిలాల్, రాతిరామ్, జగదీష్, మరియు ఇతర లాభానా నాయకులు పాల్గొన్నారు.
