చింతలపాలెం ఆగస్టు 19 (ప్రజా జ్యోతి) : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, మూసి నది నుండి పులిచింతల కు భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. అవుట్ ఫ్లో 4 లక్షలు దాటడంతో ప్రాజెక్టు అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఈ సంవత్సరం మొదటిసారి 15 గేట్ల ఎత్తడంతో పులిచింతల ప్రాజెక్టు నిండుకుండలా దర్శనమిస్తుంది. మంగళవారం ఉదయం 10 గంటల వరకు ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 34.5448 టీఎంసీలుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులకు గాను ఇప్పటి వరకు నీటిమట్టం 167.222 అడుగులకు చేరింది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 4,32,404 క్యూసెక్కులు నమోదు కాగా, అవుట్ ఫ్లో 4,21,404 క్యూసెక్కులుగా నమోదయింది. 14 రేడియల్ క్రస్ట్ గేట్లు 4 మీటర్లు, ఒక గేటు 2.5 మీటర్లు ఎత్తి 4,19,318 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. లీకేజీల ద్వారా 400 క్యూసెక్కులు, ప్రాజెక్టు ఎడమవైపున ఉన్న తెలంగాణ జెన్‌కో ద్వారా ద్వారా జల విద్యుత్ ఉత్పత్తి కోసం 16,600 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. పులిచింతల విద్యుత్ కేంద్ర సామర్థ్యం 120 మెగావాట్లు కాగా, ప్రస్తుతం నాలుగు యూనిట్ల ద్వారా 105 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది.
