గాంధారి, ఆగస్టు 18 (ప్రజాజ్యోతి)
గాంధారి మాజీ ఎంపీపీ బస్సి దశరథ్ నాయక్ నేరల్ తండాలోని తన నివాసంలో సోమవారం భోగ్ బండార్ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు దేవునికి ప్రత్యేక పూజలు చేసి, అనంతరం అందరితో కలిసి సహపంక్తి భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో గాంధారి మాజీ, తాజా జడ్పీటీసీ శంకర్ నాయక్, మాజీ, తాజా ఎంపీపీ రాధా బలరామ్ నాయక్, కాంగ్రెస్ ఎల్లారెడ్డి అసెంబ్లీ యూత్ ప్రెసిడెంట్ సర్దార్ నాయక్, మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ మోహన్ నాయక్, గాంధారి ఏఐబిఎస్ఎస్ అధ్యక్షులు బొట్టు మోతీరామ్, గాంధారి సొసైటీ డైరెక్టర్ రాథోడ్ నెహ్రూ, ఏఎంసీ డైరెక్టర్ పర్సరామ్, తాజా, మాజీ సర్పంచ్ గొల్లాడి రవీందర్, తాజా, మాజీ ఎంపీటీసీ హేమ్లా నాయక్, తాజా, మాజీ ఉప సర్పంచ్ బస్సి నర్సింగ్, మాజీ ఎంపీటీసీ మీట్యా, గొల్లాడి గణేష్, మదన్, సంతోష్, వసంతరావు, ఛత్రు మరియు పలువురు పాల్గొన్నారు.