కాలభైరవ స్వామికి సింధూర పూజలు
రామారెడ్డి ఆగస్టు12 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండల కేంద్రంలోని ఇసన్నపల్లి- రామారెడ్డి గ్రామాలలో కొలువై ఉన్న శ్రీ కాలభైరవ స్వామి దక్షిణ కాశీగా పిలవబడుతున్న పుణ్యక్షేత్రం, స్వామివారికి మంగళవారం సందర్భంగా పూలమాలలతో అలంకరించి సింధూర పూజలను నిర్వహించారు. తదుపరి భక్తులకు అన్న ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో ప్రభు గుప్తా, జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్, సహాయకులు నాగరాజు, భరత్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.