సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తిరుమల నగర్ లో గల బేచిరాగ్ మాదారం ముత్యాలమ్మ తల్లి దేవాలయంలో బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర రావు, డీఎస్పీ ప్రసన్నకుమార్ తో పలువురు ప్రముఖులు, నాయకులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకల్లో దేవాలయ కమిటీ అధ్యక్షులు మారం వెంకటరెడ్డి,ప్రధాన కార్యదర్శి వల్దాస్ ఏడుకొండలు,ఉపాధ్యక్షులు ఒగ్గు వెంకన్న, కోశాధికారి పరిపూర్ణచారి,మాజీ కౌన్సిలర్లు నిమ్మల వెంకన్న, సలిగంటి సరిత వీరేందర్, హనుమంతరావు, జలంధర్ రెడ్డి,వల్దాస్ రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.