బుగ్గన కుమారుడి వివాహ రిసెప్షన్ చూసుకుని వెళుతుండగా ప్రమాదం… ఆరుగురి పరిస్థితి విషమం

V. Sai Krishna Reddy
1 Min Read

మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ ఈరోజు డోన్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి జగన్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. జగన్ రాకతో డోన్ జనసంద్రంగా మారింది. పెద్ద సంఖ్యలో పార్టీ అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒక అపశృతి చోటుచేసుకుంది.

హైవేపై వెల్దుర్తి వద్ద టైరు పేలి ట్రాలీ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెల్దుర్తి ఆసుపత్రికి, కర్నూలు ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు బేతంచర్ల మండలం రుద్రవరంకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. రోడ్డు ప్రమాదానికి గురైన వారంతా ఈ వివాహ రిసెప్షన్ కు హాజరయ్యారు. వేడుక అనంతరం తిరిగి వెళుతుండగా ప్రమాదం సంభవించింది

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *