తల్లిపాల వారోత్సవాలు
రామారెడ్డి ఆగస్టు 05 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండల కేంద్రంలో పలు అంగన్వాడి సెంటర్లలో మంగళవారం తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. వారోత్సవాలలో సందర్భంగా గర్భిణీల కు, బాలింతలకు, తల్లిపాలపై అవగాహన తోపాటు తల్లిపాలు అమృతం లాంటిది అని, అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలు పట్టించడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, ప్రతి ఒక్కరూ తప్పకుండా ముర్రుపాలు పుట్టిన శిశువుకు అరగంటలోపు పట్టించాలి అని, తల్లిపాలు తాగడం వల్ల తల్లికి రొమ్ము క్యాన్సర్, గర్భాశైకాన్సర్, గుండె జబ్బులు, దూరమవుతాయి. ఎముకల దృఢత్వం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల సూపర్వైజర్ జ్యోతి, మాట్లాడుతూ తల్లిపాలు అమృతం లాంటిది ప్రతి బిడ్డకు కచ్చితంగా తల్లిపాలు తాగించడం ఆరోగ్యానికి శ్రేష్టమని, ఈ విధంగా చేయడం వలన తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారని రోగనిరోధక శక్తి పెంచుకొని దృఢంగా ఉండడం ఆయురారోగ్యాలతో ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ జ్యోతి, టీచర్లు సుజాత, సృజన, ఆయా సెంటర్ల అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు, వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.