బీసీ రిజర్వేషన్ 42% అమలు చేయాలని డిమాండ్ 

Kamareddy
2 Min Read

బీసీ రిజర్వేషన్ 42% అమలు చేయాలని డిమాండ్

– రాష్ట్ర కో కన్వీనర్ కార్మిక విభాగం సల్వా చారి 

కామారెడ్డి ప్రతినిధి జూలై 31 (ప్రజాజ్యోతి)

కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ 42 శాతం కల్పిస్తామని బిసి లను మోసం చేస్తుందని యుపిఎఫ్ రాష్ట్ర కోకన్వీనర్, కార్మిక విభాగం ప్రతినిధి సల్వా చారి, మాట్లాడుతూ రాష్ట్రం అందుకే ఎమ్మెల్సీ కవిత బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లో ఇందిరా చౌక్ వద్ద ఆగస్టు 4 ,5 ,6 ,7 తేదీల్లో 72 గంటలపాటు నిరాహార దీక్ష చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ నిరాహార దీక్షకు బీసీలందరూ ఐక్యంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు.కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యుపిఎఫ్ రాష్ట్ర కోకన్వీనర్, కార్మిక విభాగం ప్రతినిధి సల్వా చారి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కుల గణన చేసి పూర్తి వివరాలు సేకరించలేదని పేర్కొన్నారు. దీంతో మళ్లీ గడువు తీసుకొని ఆర్డినెన్సు తీసుకువచ్చి బీసీలకు న్యాయం చేస్తామని ప్రభుత్వం చెప్పిందని అన్నారు. దీంతో ఢిల్లీకి వెళ్లి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ విషయంలో కాలయాపన చేస్తుందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ అమలు అయ్యేంతవరకు జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత పోరాటం చేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత వెంట జాగృతి సైనికులు అండగా ఉంటూ ప్రతి ఉద్యమంలో పాలు పంచుకొని బీసీ రిజర్వేషన్ అమలయ్యే వరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఆగస్టు 4 ,5 ,6 ,7 తేదీల్లో తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి యువజన విభాగం అధ్యక్షుడు ఎదురుగట్ల సంపత్ గౌడ్ విశ్వబ్రాహ్మణ కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు గంగరాజు,విష్ణు చారి, గణేష్ గౌడ్, కామారెడ్డి జిల్లా జాగృతి యువజన విభాగం జిల్లా నాయకులు జొన్నల వినోద్ కుమార్, జొన్నాల రాము, రమేష్ సిహెచ్, చంద్రం, స్వామి,సంతోష్, మాలోత్ హనుమంతరావు నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *