నూతన ఆహార భద్రత కార్డులు పంపిణీ
రామారెడ్డి జూలై 31(ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామం లో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆహార భద్రత కార్డులను పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో రామారెడ్డి మండల ఓబిసి సెల్ అధ్యక్షులు బండి ప్రవీణ్, మద్దికుంట గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు దుంపల బాలరాజు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి, తోట లింగం, విలేజ్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.