నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి జీఎస్ఎల్వీ-ఎఫ్16… విజయవంతంగా కక్ష్యలోకి ‘నైసార్’

V. Sai Krishna Reddy
1 Min Read

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సంయుక్తంగా రూపొందించిన నైసార్ ఉపగ్రహాన్ని మోసుకుంటూ, భారత వాహన నౌక జీఎస్ఎల్వీ-ఎఫ్16 నింగిలోకి దూసుకెళ్లింది. అత్యంత శక్తిమంతమైన అబ్జర్వేషన్ శాటిలైట్ నైసార్ ను విజయవంతంగా కక్ష్యలోకి చేర్చింది. ఈ ఉపగ్రహం బరువు 2,393 కిలోలు.

 

నైసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్. ఇందులో ఉండే రెండు భారీ డిష్ ల వంటి నిర్మాణాలు భూమిపైకి మైక్రోవేవ్, రేడియో వేవ్ సంకేతాలు పంపుతాయి. ఆ సంకేతాలు భూమిని తాకి పరావర్తనం చెంది తిరిగి శాటిలైట్ ను చేరతాయి. నైసార్ లోని సాంకేతిక వ్యవస్థలు ఆ సంకేతాలను విశ్లేషించి చిత్రాలుగా రూపొందిస్తాయి.

ప్రకృతి విపత్తులను ఇది ముందుగానే అత్యంత కచ్చితత్వంతో అంచనా వేస్తుందని భావిస్తున్నారు. ఇస్రో అత్యంత చవకగా రాకెట్ ప్రయోగాలు చేపట్టడం గమనించిన నాసా… ఈ ఉపగ్రహ ప్రయోగం కోసం ఇస్రోతో జట్టుకట్టింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *