రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో రైల్వే ఓవర్ బ్రిడ్జి వంతెన పనులు సాగడం లేదు

Karimnagar Bureau
6 Min Read

154 కోట్ల రూపాయల నిధులు అందుబాటులో ఉన్నా రైల్వే వంతెన పనులు జరగపోవడం చాలా దురదృష్టకరం.

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేక చొరవ తీస్కోని సేతుబంధన్ ప్రాజెక్టులో ఆర్ ఓ బి పనులు ప్రారంభం చేశారు.

ఆర్ ఓ బి లో వెంటనే భూ సేకరణ సమస్యను పరిష్కరించాలని బీజేపి శ్రేణులతో కలిసి కలెక్టర్ కు వినతి పత్రం అందించిన మాజీ మేయర్ యాదగిరి సునిల్ రావు.

కార్యక్రమంలో పాల్గొన్న బీజేపి మాజీ కార్పొరేటర్లు, నాయకులు.

కరీంనగర్ బ్యూరో, జూలై 29, (ప్రజాజ్యోతి)
రాష్ట్ర ప్రభుత్వం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కు కాన్కరెన్స్ రిపోర్ట్ ఇవ్వకుండా భూసేకరణ విషయంలో తీవ్ర జాప్యం చేయడంతోనే పనులు ముందుకు సాగడం లేదని భారతీయ జనతా పార్టీ నేత మాజీ మేయర్ యాదగిరి సునిల్ రావు అన్నారు. కరీంనగర్ కలెక్టరెట్ లో మంగళవారం రోజు బీజేపి శ్రేణులతో కలిసి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ భూసేకరణ సమస్యను వెంటనే పరిష్కరించి.వంతెన పనులు కొనసాగించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ యాదగిరి సునిల్ రావు మీడియాతో మాట్లాడుతూ.అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని అన్న చందంగా కరీంనగర్ తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ విషయం లో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారిస్తుందని మండి పడ్డారు. భూసేకరణ లో జాప్యం చేస్తూ ఆర్ ఓ బి అభివృద్ధి పనులు ముందుకు సాగకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుందని ద్వజమెత్తారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేక చొరవ తీస్కోని కేంద్ర ప్రభుత్వం ద్వారా సేతుబంధన్ ప్రాజెక్టులో తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సాంక్షన్ చేయించి… 154 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి… గతంలోనే పనులను ప్రారంభం చేయించారని అన్నారు. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ ఓ బి నిర్మాణం లో కీలకమైన భూ సేకరణ విషయాన్ని పట్టింపు చేయడం లేదని మండి పడ్డారు. గతంలో 150 ఫీట్ల వెడల్పుతో ప్రతిపాదించిన ఆర్ ఓ బి సర్వీస్ రోడ్డు నేడు 125 ఫీట్లకు కుదించి రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి కాన్కరెన్స్ రిపోర్టు ఇవ్వకపోవడంతో భూ సేకరణ లో తీవ్ర జాప్యం జరుగుతుందని ద్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి నిధులతో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం ను పూర్తి చేయడానికి 154 కోట్లు విడుదల చేస్తే…. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా కనీసం భూసేకరణ అంశాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వ్యవహారిస్తుందని తెలిపారు. ఏదైనా ప్రాజెక్టు పనులు ఆలస్యంగా జరిగితే… దానికి కారణం నిధులు అందుబాటులో లేకపోవడం కావచ్చు… కానీ 154 కోట్ల నిధులు అందుబాటులో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు ముందుకు సాగకపోవడం చాలా దురదృష్టకరం అన్నారు. గత 2023 లో కేంద్ర ప్రభుత్వం నుండి మంత్రి బండి సంజయ్ కుమార్ పూర్తి గ్రాంటు రూపేనా 154 కోట్ల రూపాయలు విడుదల చేయించి 2023 జులైలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కు శంఖు స్థాపన చేసి పనులు ప్రారంభం చేస్తే… ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య దోరనితో పనులు ముందుకు సాగడం లేదని అన్నారు. దీంతో నగర ప్రజలు, వాహానదారులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారని తెలిపారు. గతంలో రెవెన్యూ శాఖ 150 ఫీట్లకు మార్కింగ్ చేసి రిపోర్ట్ తయారు చేసి నష్ట పరిహారం చెల్లించేందుకు సిద్దం అయితే… మల్లి తిరిగి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని 125 ఫీట్లకు కుదించారని గుర్తు చేశారు. 125 ఫీట్లకు కుదించిన దాన్ని ఆర్ & బి శాఖ వారు ఇప్పటి వరకు సరైన కాన్కరెన్స్ రిపోర్టు ఇవ్వకపోవడంతో జిల్లా యంత్రంగం, రెవెన్యూ శాఖ భూసేకరణ సర్వే చేయడం లేదని అన్నారు. ఇలా భూసేకరణ కు సరైన రిపోర్టు ఇవ్వకపోతే ఏ విధంగా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు ముందుకు సాగుతాయని ప్రశ్నించారు. మంత్రి బండి సంజయ్ కుమార్ నిధులు తెప్పించి పనులు ప్రారంభం చేయించినా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ… ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని తెలిపారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ భూసేకరణ సమస్యను పరిష్కరించేలా చర్యలు తీస్కోవాలని భారతీయ జనతా పార్టీ పక్షాన జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశామని తెలిపారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సర్వే చేపట్టి ఎక్కడెక్కడైతే భవనాలు పోతున్నాయో వాటికి మార్కింగ్ చేయించి…తగిన నష్ట పరిహారం చెల్లించి కాంట్రాక్టర్ ద్వారా పనులు చేయించేలా తగిన చర్యలు తీస్కోవాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. ఆర్ ఓ బి భూసేకరణ సమస్యను పరిష్కరిస్తే తప్ప పనులు ముందుకు సాగవని తెలిపారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం విషయంలో సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ…. పనులు ముందుకు సాగడం లేదని బీజేపి వైపు నెట్టేయడం చాలా దుర్మార్గం అన్నారు. ఇది ఎంత వరకు న్యాయమో ప్రజలు ఆలోచన చేయాలని సూచించారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ను సాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వం… నిధులు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం, కానీ పనుల్లో జాప్యం చేసేది రాష్ట్ర ప్రభుత్వం అని స్పష్టం చేశారు. 2023 జులై లో బ్రిడ్జ్ నిర్మాణం పనులు ప్రారంభం చేస్తే… దాని తర్వత చేపట్టిన కరీంనగర్, కొత్తపల్లి రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు పూర్తై ప్రారంభ మయ్యాయని గుర్తు చేశారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం లో ఎక్కడ జాప్యం జరుగుతుంది… ఎందువల్ల జాప్యం జరుగుతుంది అనే విషయాన్ని ప్రజలు కూడ ఆలోచించాలని పిలుపు నిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి నిర్లక్ష్యం తోనే రైల్వే వంతెన పనులు సాగడం లేదని అన్నారు. నిధులున్నప్పటికీ కూడ నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య దోరనే కారణమని మండి పడ్డారు. వెంటనే జిల్లా కలెక్టర్ గారు భూసేకరణ సమస్య విషయంలో ప్రత్యేక చొరవ తీస్కోని ఆర్ &బి శాఖ కాన్కరెన్స్ రిపోర్ట్ ఇచ్చేలా చర్యలు తీస్కోవాలని డిమాండ్ చేశారు. వెంటనే సర్వే చేయించి…. నష్టపరిహారం చెల్లించాల్సింది పోయి కాంగ్రెస్ నాయకులు అనవసరంగా బీజేపి పార్టీ పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండి పడ్డారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం విషయంలో కాంగ్రెస్ నాయకులు వ్యవహారిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. సేతుబంధన్ ప్రాజెక్ట కింద 154 కోట్ల నిధులు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం తీసుకొచ్చింది మంత్రి బండి సంజయ్ కుమార్ అనే విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. 154 కోట్ల నిధులు సద్వినియోగం చేయడంలో ఇంత ఇబ్బందులకు సృష్టిస్తున్నది ఎవరనేది ప్రజలు గమనించాలని కోరారు. గతంలో రైల్వే వంతెన పనులు జరుగుతావుంటే రాకపోకలు చేసే ప్రజలకు తాత్కాలికంగా రోడ్డు కావాలంటే మంత్రి బండి సంజయ్ కుమార్ 30 లక్షలతో తాత్కాలికంగా రోడ్డు నిర్మాణం చేయించారని గుర్తు చేశారు. ఇప్పుడు ఇంకో వైపు పనులు జరుగతాయి కాబట్టి అక్కడ కూడ తాత్కాలికంగా రోడ్డు వేయాలని జిల్లా కలెక్టర్ ను కోరామన్నారు. ఆర్ ఓ బి నిర్మాణం విషయంలో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మీనమేశాలు లెక్కించ కుండ 20 రోజుల్లో భూసేకరణ సమస్యను పరిష్కరించి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు వేగవంతంగా పూర్తయ్యేలా చర్యలు తీస్కోవాలని డిమాండ్ చేశారు. ఆర్ ఓ బి విషయంలో ఇదే నిర్లక్ష్య తంతును కొనసాగిస్తే…భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మాజీ కార్పోరేటర్లు గుగ్గిలము రమేష్, కొలగాని శ్రీనివాస్, కాసర్ల ఆనంద్, చొప్పరి జయశ్రీ, అనూప్ కుమార్, లెక్కల స్వప్న వేణు, బీజేపీ నాయకులు గాయత్రి, చాడ ఆనంద్, లడ్డు ముందాడా, నాంపల్లి శ్రీనివాస్, ఆవుదుర్తి శ్రీనివాస్, బండారి అంజి, రాజు, కన్నం శ్రీనివాస్, రాజ్ ప్రభాకర్, రమేష్, నవీన్, కుమార్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *