నల్లజెరు జ్యోతికి న్యాయం చేయాలి…. దళిత సంఘాల డిమాండ్.
కులం తక్కువ అని చులకన!
మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తాం
న్యాయం జరగకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి!
బాన్సువాడ ఆర్ సి బాన్సువాడ జులై 25 (ప్రజా జ్యోతి)
బీర్కూర్ గ్రామానికి చెందిన నల్లజెరు జ్యోతి మైనర్ అమ్మాయిని నర్ర సాయిలు అదే గ్రామానికి చెందిన బి సి కులానికి చెందిన వ్యక్తి ప్రేమ పేరుతో పెళ్లి చేసుకొని ఒక్క బాబుని కని ఇప్పుడు వాళ్ళను రోడ్డుపై పడేసాడు… న్యాయానికి వెళితే.. నాతో నిన్ను పోషించడం కాదు అని నెట్టివేయడం సరైన విధానం కాదనీ .. జ్యోతికి న్యాయం జరిగేంతవరకు ఊరుకునేది లేదని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆర్ & బి గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా మాల మహానాడు సంఘం బాన్స్వాడ డివిజన్ అధ్యక్షులు మల్లూరి సాయిలు మాట్లాడుతూ జ్యోతి కి న్యాయం జరిగేంత వరకు మా దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు కూడా చేయడానికి వెనుకాడబొమని హెచ్చరించారు నర్ర సాయిలు తక్షణమే అమ్మాయికి న్యాయం చేయాలని లేని పక్షంలో ఎంత వరకైనా మా పోరాటాలు ఆపబొమని ఈ సందర్బంగా నర్ర సాయిలు ను హెచ్చరించర్ . ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రుశేగాం భూమన్న, MRPS జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ కిష్టాపురం సురేష్, అంబేద్కర్ సంఘం బాన్స్వాడ పట్టణ అధ్యక్షులు నక్క విజయ్, మాల సంఘం అధ్యక్షులు గున్న సాయిలు, మరియు జ్యోతి కుటుంబ సభ్యులు శివ కుమార్, బాలయ్య, గంగామణి తదితరులు పాల్గొన్నారు.