ఇక ప్రతి బుధవారం మిర్యాలగూడ లో ప్రత్యేక ప్రజావాణి మరో వినూత్న కార్యక్రమానికి ఎమ్మెల్యే బి ఎల్ ఆర్ శ్రీకారం
మిర్యాలగూడ, జులై 23,(ప్రజాజ్యోతి):నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి,సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ ల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమానికి బుధవారం శ్రీకారం చుట్టారు.జిల్లా కలెక్టరేట్ గ్రీవెన్స్ తరహాలో పల్లె ప్రజలకు అందుబాటులో ప్రతి బుధవారం కీలకమైన శాఖలకు చెందిన ఉన్నత అధికారుల పర్యవేక్షణలో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు.దరఖాస్తు వచ్చిన 15 రోజులలో సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపుతామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దూర ప్రాంతంలో ఉన్న జిల్లా కేంద్రానికి వ్యయ ప్రయాసలకు ఓర్చి సమస్యల పరిష్కారం కోసం ప్రదక్షణలు చేయకుండా అందుబాటులోనే నియోజకవర్గ కేంద్రంలో ప్రజావాణి ఏర్పాటు చేయడంతో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.అధికారులకు కూడాబాధ్యతాయుతంగా పనిచేస్తూ జవాబుదారితనం పెరుగుతుందన్నారు. నియోజకవర్గ ప్రజల మేలు కోసం చేపడుతున్న వినూత్న కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.