చేర్యాల ప్రజాజ్యోతి: చేర్యాల డివిజన్ సాధన కోసం ఈనెల 25న జరిగే బంద్ ను విజయవంతం చేయాలని చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ పిలుపునిచ్చారు. ఈనెల 25న తలపెట్టిన బంద్ కు సంబంధించిన కరపత్రాలను మంగళవారం కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ నెల 25న జరిగే బందు కోసం సిపిఐ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, న్యూడెమోక్రసీ,ఆర్ఎస్పి, బీఎస్పీ, మాల మహానాడు, ఎమ్మార్పీఎస్, విశ్రాంత ఉపాధ్యాయుల సంఘం, వివిధ కుల సంఘాలు, యువజన సంఘాలు, అందరూ స్వచ్ఛందంగా తమ మద్దతును తెలియజేసి బందును విజయవంతం చేయాలని జేఏసీ చైర్మన్ కోరారు.