బంగ్లాదేశ్ విమాన ప్రమాదంలో 19కి పెరిగిన మృతుల సంఖ్య… కూలిపోయింది చైనా తయారీ విమానం

V. Sai Krishna Reddy
1 Min Read

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఉత్తర ప్రాంతంలో ఉన్న మైల్‌స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్ ప్రాంగణంలో సోమవారం ఓ యుద్ధ విమానం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 19కి పెరిగింది. మృతుల్లో 16 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు, ఒక పైలెట్ ఉన్నారు. ఈ మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో, గాయపడిన వారి సంఖ్య ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

కూలిపోయిన విమానం ఎఫ్-7బీజీఐ రకానికి చెందినది. ఇది చైనా జె-7 యుద్ధ విమానానికి అధునాతన వెర్షన్. బంగ్లాదేశ్ వాయుసేన వద్ద ఉన్న 16 విమానాల్లో ఇది ఒకటి. స్థానిక నివేదికల ప్రకారం, ఎఫ్-7బీజీఐ విమానం సాధారణ శిక్షణ విధుల్లో ఉండగా ఈ ప్రమాదం జరిగింది.

టీవీ ఫుటేజ్, ఆన్‌లైన్‌లో షేర్ చేయబడిన వీడియోలలో ప్రమాద స్థలం వద్ద మంటలు, పొగ దట్టంగా వెలువడుతూ కనిపించాయి. అత్యవసర సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. ఓ వీడియోలో శిథిలాల కింద కూరుకుపోయిన విమాన ఇంజిన్ దృశ్యం భీతావహంగా ఉంది. దూరం నుంచి తీసిన మరో వీడియోలో మండుతున్న శిథిలాల వద్దకు ప్రజలు గుమిగూడటం, ఒక అంతస్తు పాఠశాల భవనం మంటల్లో కాలిపోవడం కనిపించింది మరో వీడియోలో, గాయపడిన ఓ వ్యక్తి మసి, శిథిలాల మధ్య నుంచి చిరిగిన దుస్తులతో అక్కడి నుండి దూరంగా వెళుతూ కనిపించాడు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *