చేర్యాల జూలై21(ప్రజాజ్యోతి):చేర్యాల పోలీస్ స్టేషన్ ను హుస్నాబాద్ ఏసిపి సదానందం సోమవారం రోజున వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలను పరిశీలించి పోలీస్ స్టేషన్లో సిబ్బంది నిర్వహిస్తున్న విధుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏసిపి మాట్లాడుతు ఫిర్యాదిదారులతో మర్యాదగా మాట్లాడాలని పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి దరఖాస్తు దారునితో మాట్లాడి సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని తెలిపారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలపై ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా నిఘా ఉంచాలని తెలియజేశారు. పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీషీట్స్, హిస్టరీ షీట్స్, సస్పెక్ట్స్ షీట్స్ లిస్టును తనిఖీ చేసి వారిపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో చేర్యాల సిఐ శ్రీను, ఎస్ఐ నవీన్, ఏఎస్ఐలు,హెడ్ కానిస్టేబుళ్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు