గుర్తు తెలియని మహిళ, మార్గమధ్యలో దోపిడీ
కామారెడ్డి ప్రతినిధి జూలై 20 (ప్రజా జ్యోతి)
చింతమానుపల్లి గ్రామానికి చెందిన చిన్న గంగయ్య కామారెడ్డి లోని దుబ్బ గౌడ్ కల్లు దుకాణంలోకి వెళ్ళగా, అక్కడ ఇద్దరూ ఆడ మనుషులు మాట మాట కలిపి అతనితో పరిచయంపెంచుకున్నారు.ఎక్కడికి వెళ్తున్నారు అని అడగగా, చిన్న గంగయ్య తన సొంత గ్రామం చింతమానుపల్లి కి వెళ్తున్నానని చెప్పగా, అందులో నుండి ఒక మహిళ మీరు వెళ్లే దారిలో నన్ను దింపేయమని అడిగింది.దానితో చిన్న గంగయ్య గుర్తు తెలియని మహిళ ను తన యొక్క బండిపై ఎక్కించుకొని వెళ్తుండగా, మార్గమధ్యలో హరిజన వాడ కళ్ళు దుకాణంలో అతను కళ్ళు తాగుతానని చెప్పగా, అందుకు ఆమె సరే అని చెప్పిగా అతడు కల్లు తాగి వచ్చిన తర్వాత ఇద్దరు బండిపై కొద్ది దూరం వెళ్ళినాక, ఆమె బండి ఆపమని అతనిని అడగగా, బండి ఆపిన కొద్ది నిమిషాలలోనే ఇద్దరు మగ వ్యక్తులు అక్కడికి వచ్చి నా భార్య ని బండిపై ఎందుకు ఎక్కినది అని ప్రశ్నించి, నీకు నా భార్యకు సంబంధం ఏమి ఉందని బెదిరించి, తన జేబులో ఉన్నటువంటి 28 వేల రూపాయలను, పర్స్ ను గుర్తు తెలియని వ్యక్తులు లాక్కొని వెళ్లడం జరిగిందని ఆదివారం ఫిర్యాదు రాగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.