సిద్దిపేట గులాబీ జెండా పురిటి గడ్డ… – సిద్దిపేట అభివృద్ధి వెనకబాటుపై కాంగ్రెస్ కి బుద్ది చెప్పాలి…

Medak Staff Reporter

సిద్దిపేట గులాబీ జెండా పురిటి గడ్డ

 

సిద్దిపేట అభివృద్ధి వెనకబాటుపై కాంగ్రెస్ కి బుద్ది చెప్పాలి

 

ఎన్నికలకు సిద్ధం కావాలి.

 

– సిద్దిపేట అర్బన్ మండల ముఖ్య నాయకుల సమావేశం లో బి ఆర్ ఎస్ నేతలు

 

 

వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి తగిన గుణపాఠం చెప్పాలని బి ఆర్ ఎస్ నేతలు పిలుపునిచ్చారు.. సిద్దిపేట క్యాంపు కార్యాలయం లో సిద్దిపేట అర్బన్ మండల ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతు.. 19నెలల కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దిపేట అభివృద్ధి వెనక బాటుకు గురైందన్నారు.. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు.. సిద్దిపేట గులాబీ జెండాను పురుడు పోసుకుందని హరీష్ రావు గారు చేసిన అభివృద్ధి కృషి తో ఎన్నో దేశ రాష్ట్ర స్థాయి అవార్డు లు తెచ్చుకొని దేశానికె సిద్దిపేట ఆదర్శం గా నిలిచిందన్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి ని కనుమరుగు చేసిందని చెప్పారు..అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని, ఆరు గ్యారంటీ లని చెప్పి 420హామీలు అని చెప్పి కాంగ్రెస్ ప్రజల్లో 420 చీటింగ్ కాంగ్రెస్ గా చరిత్ర ఎక్కిందన్నారు.. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉందని.. కాంగ్రెస్ పార్టీ కి కర్రు కాల్చి వాత పెట్టె రోజులు దగ్గరికి వచ్చాయన్నారు.. సిద్దిపేట అభివృద్ధి కి వెనక బాటు కు కారణం అయినా కాంగ్రెస్ పార్టీ ని నాయకులను ఎక్కడికక్కడ నిలదీయండన్నారు..19 నెల్లల్లో సిద్దిపేట కు మీరు చేసింది ఏంటో చెప్పాలని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నాయకులపై మండిపడ్డారు.. ఈ కర్యక్రమం లో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, మాజీ సూడా చైర్మన్ రవీందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ఎద్దు యాదగిరి, సీనియర్ నాయకులు బాల్ రంగం, బాల కృష్ణా రెడ్డి, మండల సమన్వయ కర్త లు మచ్చ వేణుగోపాల్ రెడ్డి, కొండం సంపత్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ అల్లం ఎల్లం, pacs చైర్మన్ శ్రీనివాస్, రైతు సమన్వయ అధ్యక్షులు జనార్దన్, మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, సీనియర్ నాయకులు, విద్యార్థి, యువజన నాయకులు పార్టీ నేతలు పాల్గొన్నారు..

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *