సూర్యాపేట జిల్లా ప్రతినిధి జూలై 15(ప్రజాజ్యోతి):యండ్లపల్లి గ్రామానికి చెందిన లక్ష్మమ్మ అనే మహిళ గత కొన్ని సంవత్సరాలుగా కాలికి వేరికోస్ అల్సర్ తో బాధపడుతున్నారు.సూర్యాపేట మన అమ్మ హాస్పిటల్ లో సంప్రదించగా అపోల్లో హాస్పిటల్ డాక్టర్ అజయ్ వాస్క్యూలర్ సర్జన్ సూర్యాపేట లోన్ మొట్టమొదటి సరిగా కోతల్లేకుండా,బ్లీడింగ్ లేకుండా లేజర్ అబ్లేషన్ పద్ధతిలో శస్త్రచికిత్స నిర్వహించారు.పేషెంట్ మొదటి రోజే తిరిగి సాధారణ స్థితిలో నడవగలిగారు.డాక్టర్ సుధీర్ కుమార్,డాక్టర్ సుప్రజ ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు.చిన్నతనం నుండి నాలుక అతుక్కుని ఉన్నటువంటి మహిళ కి కోత లేకుండా,బ్లీడింగ్ లేకుండా లేజర్ చికిత్స ద్వారా మన అమ్మ డెంటల్ హాస్పిటల్ లో డాక్టర్.రుక్మిణి చిత్ర (సూర్యాపేట లో మొట్ట మొదటి నోటి క్యాన్సర్ స్పెషలిస్ట్),డాక్టర్ వినయ్ సర్జరీ నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు డాక్టర్ సుధీర్ కుమార్ మరియు ఇతర వైద్యులకు అభినందనలు తెలిపారు.