నిజాంసాగర్ ప్రాజెక్టు రూపకర్తకు ఘన నివాళులు
* ఉమ్మడి నిజాంబాద్ జిల్లాకు సాగు, తాగునీరు ప్రాజెక్టు రూపకర్త నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహదూర్ జయంతి
నిజాంసాగర్ ప్రజా జ్యోతి జూలై 11
తెలంగాణ నీటిపారుదల పితామహుడు, తెలంగాణ ఆర్ధర్ కాటన్ గా వర్ణించబడిన నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహదూర్ జూలై 11న వారి జయంతిని తెలంగాణ ఇంజనీరింగ్ దినోత్సవంగా ఆయన జయంతి ఉత్సవాలను నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద ఘనంగా నిర్వహించారు. నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్న నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహదూర్ విగ్రహానికి ఇంజనీర్లు పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ నీటిపారుదల రంగానికి విశేషమైన సేవలు అందించిన గొప్ప ఇంజనీరింగ్ నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహదూర్ అని వారు కొనియాడారు. తన దర్శనీకతో ఉమ్మడి నిజాంబాద్ కామారెడ్డి జిల్లాలకు భవిష్యత్తు సాగు, తాగునీరు అవసరాలకు అందేలా నిజాంసాగర్ ప్రాజెక్టును రూపకల్పన చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఏఈఈ సాకేత్, అక్షయ్, నవీన్, వెంకటేష్ నాయక్, ప్రాజెక్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.