రాయపోల్ జులై 10 ప్రజా జ్యోతి: సాధారణంగా జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటారు. రాయపోల్ మండలం వడ్డేపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి జన్మదిన పురస్కరించుకొని విద్యార్థుల అవసరాల ను గమనించి పాఠశాలకు 27వేల రూపాయలు ఖర్చు చేసి టీవీని బహుకరించారు. ముఖ్యఅతిథిగా మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులకు డిజిటల్ తరగతులు వినియోగానికి టీవీ చాలా ఉపయోగపడుతుందన్నారు. తన జన్మదినం పురస్కరించుకొని విద్యార్థులకు టీవీ బహుకరించడం ఎంతో సంతోషకరమన్నారు. ప్రతి ఉపాధ్యాయులు పాఠశాలకు తన వంతుగా ఎంతో కొంత సాయం చేయాలన్నారు. కార్యక్రమంలో బేగంపేట వడ్డేపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంజిరెడ్డి సుధాకర్ రెడ్డి, సీఆర్పీలు స్వామి యాదగిరి పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వడ్డేపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పాఠశాలకు ఎల్ఈడి టీవీని బహుకరించిన శ్రీనివాస్ రెడ్డి
Leave a Comment