సూర్యాపేట జిల్లా ప్రతినిధి జూలై 06(ప్రజాజ్యోతి):వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించాలని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్ అన్నారు.ఆదివారం సూర్యాపేట మున్సిపాలిటీ దురాజ్ పల్లి సమీపంలోని జియో బిపి పెట్రోల్ బంక్ లో ఆపరేటర్ ధరావత్ నిఖిల్ ఆధ్వర్యంలో జరిగిన జియో బిపి పెట్రోలియం ఐదవ ఫౌండేషన్ డే వేడుకలకు వారు ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినియోగదారులకు క్వాలిటీ,క్వాంటిటీతో కూడిన పెట్రోల్,డీజిల్ ను అందించాలన్నారు.అనంతరం ధరావత్ నిఖిల్ మాట్లాడుతూ జియో బిపి పెట్రోలియం కంపెనీ యాక్టివ్ టెక్నాలజీ వినియోగిస్తున్నట్లు తెలిపారు.దీనివల్ల వాహనాల ఇంజన్ రక్షణతో పాటు మెరుగైన మైలేజ్ లభిస్తుందన్నారు.అంతకు ముందు సిబ్బందితో కలిసి బంక్ ఆవరణలో మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అబ్దుల్ కరీం,కంపెనీ ఏరియా మేనేజర్ సాయి సుధీర్,ధరావత్ రమేష్,విజయ,అఖిల్,మంగ్తా నాయక్,నాగు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
