పరకాల, జులై 05 (ప్రజాజ్యోతి)::
హనుమకొండ జిల్లా పరకాల సివిల్ హాస్పిటల్ ను జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. శనివారం హాస్పిటల్ తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించి ఫార్మసిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్మసిస్టు కు మెమో జారీ చేయాలంటూ సూపరిండెంట్ ను కలెక్టర్ ఆదేశించారు. హాస్పిటల్ సిబ్బంది తీరుపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.