వర్షాకాలం పాములతో జరభద్రం…!

Kamareddy
3 Min Read

వర్షాకాలం పాములతో జరభద్రం…!

* నాటు వైద్యాన్ని నమ్ముకోవద్దు

* అందుబాటులో మందులు 

 ఎల్లారెడ్డి జూలై -3 (ప్రజా జ్యోతి )

వర్షాకాలం ప్రారంభమైంది వర్షాలు కురుస్తుండంతో రైతులు పొలం పనుల్లో బిజీ అయ్యారు. మరోవైపు ఇది పాములకు అనువైన కాలం.. జూలై, ఆగస్టు నెలలో పాములు తమ ఆవాసాలను విడిచి బయటకు వస్తుంటాయి. ఈ క్రమంలో పొలం పనులకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. వర్షాకాలంలో పాముల బెడద అధికంగా ఉంటుంది. కానీ భయాందోళనకు గురి కావలసిన అవసరం లేదు. చల్లదనానికి పాములు వాటి ఆవాసాల నుంచి బయటకు వస్తాయి. రాత్రి వేళల్లో నివాస ప్రాంతాల్లో సంచరిస్తూ ఇండ్లలోకి ప్రవేశిస్తాయి. వానాకాలం పంట సీజన్లో సాగు సిద్ధమవుతున్న సమయంలో పాములు బయటకు రావడంతో రైతులు వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి ఏటా పాము కాటుకు గురై ఎంతోమంది మృతి చెందుతున్నారు. కట్లపాము పాటిసిన క్షణాల్లో విషం రక్తంలోకి ప్రవేశించి మృతి చెంది అవకాశం ఉంటుంది. ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి ఆందోళనకు గురికాకుండా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి, స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించాలి. నాగుపాము కాటేసిన 15 నిమిషాల్లో విషం ఎక్కుతుంది. రక్తపింజర కాటేసిన రెండు గంటల తర్వాత విషం ఎక్కుతుంది. జెర్రిపోతు సిరుకట్ల పాము కాటేసిన విషయం ఉండదు. అయితే కాటేసిన చోట చికిత్స చేయడానికి ఆసుపత్రులకు తీసుకెళ్లాలి. పాములు ఎన్నో రకాలు ఉంటాయి. ఏ పాము కాటే వేస్తే ఆందోళనకు గురికాకుండా కాటేసిన దగ్గర కట్టుకట్టి ఆసుపత్రికి తీసుకెళ్లాలి.

*మంత్రగాళ్లను ఆశ్రయించొద్దు*

గ్రామీణ ప్రాంతాల్లో మూడో నమ్మకాలు ఎక్కువగా వైద్యులను సంప్రదించకుండా మంత్రగాలను ఆశ్రయిస్తుంటారు. పాము కాటుకు వైద్యం ఉంది. పాము కాటుకు గురైన వారు మంత్రకాలను ఆశ్రయించవద్దు. ఆశ్రయిస్తే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. పాము కాటుకు గురైనప్పుడు అందులోనపు గురి కావొద్దు. ఇది గుండెపోటుకు దారితీస్తుంది. ప్రాథమిక చర్యగా కాటు వేసి ప్రదేశంపై భాగంలో కట్టు కట్టాలి ఆ వెంటనే చికిత్స కోసం వెళ్లాలి.

*పాముకాటు లక్షణాలు*

వ్యక్తిని విషపూరితమైన పాము పాటిస్తే శరీరమంతా నీలం రంగుగా మారడం రక్తపోటు తక్కువగా ఉంటే సృహ కోల్పోతారు. కరిచిన చోట నొప్పి వాపు ఉంటుంది. కొందరిలో దద్దుర్లు కనిపిస్తాయి. నోటి నుంచి నురగ వస్తుంటుంది. అయస్సపడి చెమటలు పట్టి ఉంటే సాధన స్థాయి కంటే రెట్టింపు స్థాయిలో గుండె కొట్టుకుంటుంది. ఈ క్షణాల్లో ఉన్నప్పుడు తక్షణమే ఆసుపత్రులకు తీసుకెళ్తే ఎటువంటి ప్రాణహాని ఉండదని వైద్యులు చెబుతున్నారు. రాము కాటుకు గురైన వారిని 99 శాతం బతికించే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

*మందులు అందుబాటులో ఉన్నాయి*

*ఆసుపత్రి సూపరింటెండెంట్ రవీంద్ర మోహన్,*

పాము కాటుకు సంబంధించిన యాంటీ స్నేక్ వినం ఇంజక్షన్లను అందుబాటులో ఉన్నాయి. సిహెచ్ సీలో సిబ్బందిని అప్రమత్తం చేశాం. వర్షాకాలం కావడంతో పాములు సంచరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా రైతులు కూలీలు వ్యవసాయ పనుల చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. పాము కాటుకు గురైన వ్యక్తులను నేరుగా ఆసుపత్రులకు తరలించాలి. మూఢనమ్మకాలు నమ్మి సమయం వృధా చేసి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *