మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన కార్యక్రమాలలో భాగంగా ఈరోజు కోదాడ రూరల్ స్టేషన్ పరిధి జాతీయ రహదారిపై రామాపురం ఎక్స్ రోడ్ వద్ద సీఐ రజిత రెడ్డి ఆధ్వర్యంలో డ్రైవర్లకు,హమాలిలకు డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించడం జరిగినది.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా ఎస్పీ నరసింహులు ఆదేశాల మేరకు డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.డ్రగ్స్ నిర్మూలనలో ప్రజలు తమ వంతు సహకారం అందించాలని ఎక్కడైనా గంజాయి లాంటి మత్తు పదార్థాలు విక్రయిస్తున్న వినియోగిస్తున్న అలాంటి వారి సమాచారాన్ని పోలీసులకు అందించి నివారించడంలో సహకరించాలని కోరారు.డ్రగ్స్,గంజాయి లాంటి మత్తు పదార్థాలు సేవించడం వల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది అన్నారు.ఆరోగ్యం పాలవుతారు,కుటుంబ పెద్ద అనారోగ్యం చెందితే కుటుంభం దిక్కుతోచని స్థితిలో పడుతుంది అన్నారు.ఈ మత్తు పదార్థాల వల్ల జరుగుతున్న అనర్థాలను గమనించాలని అవగాహన వాటితోటే డ్రగ్స్ నిర్మూలన సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు.రోజువారి కూలీ జీవనం గడుపుతూ వచ్చిన డబ్బులను మత్తు పదార్థాల కోసం వృధా చేసుకోవద్దని ఆర్థికంగా నష్టపోవద్దని సిఐ కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్సై అనిల్ రెడ్డి పోలీస్ సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
అవగాహనతో డ్రగ్స్ నిర్మూలన సాధ్యం. కోదాడ రూరల్ సీ ఐ రజిత రెడ్డి

Leave a Comment