అమ్మ మాట.. అంగన్వాడి బాట..!
* సూపర్వైజర్ జ్యోతి
రామారెడ్డి జూన్ 11 (ప్రజాజ్యోతి)
రామారెడ్డి మండల కేంద్రంలోని అన్నీ అంగన్వాడి కేంద్రాలలో బుధవారం అమ్మ మాట..! అంగన్‌వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న ప్రతి సెంటర్లలో చిన్నారులు అంగన్వాడి,బడిలో చేరాలని చిన్నారులకు వారి తల్లిదండ్రులకు సలహా సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సరికొత్త విద్యా విధానం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక పథకం చిన్న పిల్లలకు. ఎగ్ బిరియాని అందించాలని సదుర్దేశంతో అంగన్వాడి పిల్లలకు రుచికరమైన ఎగ్ బిర్యాని తయారు చేసి వండి పెట్టడం జరిగింది. అదేవిధంగా 158 రకాల వస్తువులను చిన్నారులు ఆడుకోవడానికి ఆట వస్తువులతో స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటి ద్వారా చిన్న పిల్లలకు నైపుణ్యాన్ని సృజనాత్మకతను చదువుపై శ్రద్ధ కలిగించేందుకు ప్రభుత్వం అమ్మమాట.. అంగన్‌వాడీ బాట అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా ఈ కార్యక్రమం పై సూపర్వైజర్ జ్యోతి సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా
సూపర్వైజర్ జ్యోతి మాట్లాడుతూ..!
చిన్నారులు అంగన్‌వాడీ బడిలో చేరాలని వారికి స్వాగతం పలుకుతూ వారి పరిధిలోని కేంద్రలలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రంలో ఏర్పాటు చేశారు. ప్రతి సెంటర్ యొక్క అంగన్వాడి టీచర్ మాట్లాడుతూ మూడేండ్లకు పైబడిన చిన్నారులందరినీ అంగన్‌వాడీ కేంద్రాలకు పంపించాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్ జ్యోతి, అంగన్‌వాడీ టీచర్లు ఇంద్ర, కమల, అనసూయ, సుజాత, మాధవి, శోభ, సుధారాణి, గాలవ్వ, అంజమ్మ, మంగమ్మ, ప్రతి అంగన్వాడి సెంటర్ల హెల్పర్లు, చిన్నపిల్లలు వారి తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.