కేసీఆర్ కలల ప్రాజెక్టుగా చెప్పే కాళేశ్వరంలో చోటు చేసుకున్నట్లుగా చెప్పే అవకతవకలపై విచారణకు హాజరయ్యేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ కు రానున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఎదురయ్యే అనుభవం ఒక లెక్క. ఈ వ్యవహారం ఆయనకు కాస్త కష్టంగా ఉంటుందనటంలో సందేహం లేదు. అయితే.. ఆయనకు మించిన కష్టం ఆయన కుమార్తె కవితకు ఎదురవుతుందన్న మాట బలంగా వినిపిస్తోంది.
ఇటీవల కాలంలో తన తండ్రి కం పార్టీ అధ్యక్షుడి చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె.. అప్పటి నుంచి ఇప్పటివరకు కేసీఆర్ ను కలిసింది లేదు. ఆయనతో భేటీ అయ్యింది లేదు. కవిత మాటల్ని అందిపుచ్చుకున్న రాజకీయ ప్రత్యర్థులు కేసీఆర్ ను ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ఇంటి పంచాయితీని వీధిలోకి తీసుకొచ్చిన తన కుమార్తె తీరుపై గులాబీ బాస్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతారు
ఇటీవల కాలంలో తన తండ్రి కం పార్టీ అధ్యక్షుడి చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె.. అప్పటి నుంచి ఇప్పటివరకు కేసీఆర్ ను కలిసింది లేదు. ఆయనతో భేటీ అయ్యింది లేదు. కవిత మాటల్ని అందిపుచ్చుకున్న రాజకీయ ప్రత్యర్థులు కేసీఆర్ ను ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ఇంటి పంచాయితీని వీధిలోకి తీసుకొచ్చిన తన కుమార్తె తీరుపై గులాబీ బాస్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతారు. Also Read – 51వ రాష్ట్రం తర్వాత.. ఉన్న 50 రాష్ట్రాల్ని సక్కగా చూసుకో ట్రంప్ అంతేకాదు.. కవిత వ్యాఖ్యల వేళ.. కేసీఆర్ కు దగ్గరగా ఉండే కొందరు కవితను కలవటంపైనా ఆయన మండిపడినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. తన తండ్రి కం పార్టీ అధినేతకు నోటీసులు ఇవ్వటాన్ని కవిత తీవ్రంగా తప్పు పట్టటం.. ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే. ఇలాంటి వేళ.. కమిషన్ ఎదుట హాజరయ్యేందుకు వచ్చే కేసీఆర్ వెంట కవిత ఉంటారా? ఉండరా? అన్నది ప్రశ్న. కేసీఆర్ కు మద్దతుగా భారీ ఎత్తున జనసమూహాన్ని సమీకరించే ప్రయత్నం బీఆర్ఎస్ చేసినట్లు చెబుతున్నారు. అధినేతే స్వయంగా విచారణకు హాజరువుతున్న వేళ.. పార్టీ ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు మొదలుకొని అగ్ర నాయకత్వంతో పాటు అట్టుడుగు స్థాయిలో ఉండే వారు కూడా హాజరు కావటం ఖాయమంటున్నారు. తక్కువలో తక్కువ ఐదు వేలకు పైనే హాజరవుతారని చెబుతున్నారు. ఇలాంటి వేళ.. పార్టీ అగ్రనాయకత్వాన్ని ప్రశ్నించి.. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు తిరుగుతున్నట్లుగా ఆమె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. ఇప్పుడు కవిత నిర్ణయం ఎలా ఉంటుందన్నది ప్రశ్నగా మారింది.
విచారణ వేళ కవిత హాజరైతే పరిణామాలు ఎలా ఉంటాయి? పార్టీ అగ్రనాయకత్వం ఎలా స్పందిస్తుంది? పార్టీ నేతల ఎలా రియాక్టు అవుతారు? లాంటి ప్రశ్నలు తలెత్తుతున్న పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కవిత ఎదురుపడిన వేళ.. గులాబీ బాస్ రియాక్షన్ ఏమిటి? అన్నది అన్నింటికంటే పెద్ద ప్రశ్న. అలా అని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కవిత హాజరు కాకుంటే ఆమెవైపు వేలెత్తి చేపటం ఖాయం. ఇలా చూసినప్పుడు.. విచారణ ముచ్చట ఎలా ఉన్నా కవితకు ఎదురైన కష్టం అంతా ఇంతా కాదంటున్నారు