కేడి బీడీ టేకేదార్ పరార్…?
– డబ్బులతో ఉడాయించిన బీడీ టేకెదార్..?
– ఇప్పటికే ప్రస్తుతం ముగ్గురు భార్యలు..?
– మరో పరాయి మహిళతో పరార్..?
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రజా జ్యోతి (జూన్ 6)
తెలంగాణలోని కొన్ని జిల్లాలలో బీడీలు చుట్టి వారి కుటుంబాన్ని పోషించుకుంటున్న నిరుపేద కుటుంబాల మహిళలను లోబర్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఓ బీడీ కంపెనీలో పని చేసే టేక్ ఎద చేసిన నిర్వాకం. అదేవిధంగా తాలు చెప్పింది వేగంగా తాను చెప్పినట్టు వినాల్సిందిగా, ఆర్డర్ వేయడం. లేదంటే పగ పట్టినట్టే ప్రశ్నించడం. ముఖ్యంగా పొగాకు తంబాకు సరిగా తూకం చేయకపోవడం, చెప్పినట్టు వినాలని జులుం చేయడం, మానసికంగా ఒత్తిడికి గురి చేయడం ఇలా చాలా రోజుల నుంచి అతను ఇష్టపడ్డ స్త్రీలు నానా బాధలు అనుభవిస్తున్నారని సమాచారం? అదేవిధంగా ఈయన గాని చేసిన గొప్ప నిర్వహణకు,పరాయి స్త్రీ మోజులో పడుతూ ఇప్పటికే ముగ్గురు భార్యలు ఉండగా మూడో భార్యను వదిలిపోయినట్టు స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో ని ఓ సెంటర్ లో నంబర్ బీడీ సెంటర్ నిర్వాహకుడు, టేకెదార్ బీడీ వర్కర్లను వశపరచుకునేందుకు బీడీ కట్టలు సరిగా లేవని, ఆకుతంబాకు తూకంలో మోసం చేయడం, తాను చెప్పినట్టు వినే మహిళలతో సన్నిహితంగా ఉంటూ రాసలీలలు నడపడం ఇవన్ని మునీంకు అలవాటు. ఇలా గొడవ జరిగిన ప్రతిసారి బీడీ కంపేని యాజమాన్యం ఇతర సెంటర్లకు బదిలీ చేయడం, ఏ సెంటర్ కు పంపిన అక్కడ ఓ మహిళ తో పరిచయం ఏర్పడుతుంది. అదే అదునుగా భావించి అదే మహిళను తెలియ ని చోటుకు తీసుకెళ్ళి మనువాడి సహజీవనం చేస్తాడట..? ఇలాగే అతని భార్య ను వదిలించు కోవాలి వేరే మహిళతో వెళ్లిపోతాడట ? ఇప్పటికే అతనికి ముగ్గురు భార్యలు, మూడో భార్య కు ఒక కూతురు ఉందనీ సమాచారం, మూడో నెంబర్ బీడీ సెంటర్ లో బీడీలు చేసే బీడీ కార్మికులకు డబ్బులు దాదాపు రెండు లక్షల పై మాటే అతనినుండి రావాల్సి ఉందని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
బీడీ కార్మిక సంఘాలు ఎక్కడ …..?
బీడీ కార్మికుల కోసం పోరాడుతామని బీడీ కార్మికుల నుండి ప్రతి సంవత్సరం డబ్బులు వసూలు చేసుకుని వెళ్తున్న బీడీ కార్మిక సంఘాలు చోద్యం చూస్తున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా బీడీ యాజమాన్యం ఆతని పై కేసులు నమోదు చేసి కఠినంగా శీక్షించాలని బీడీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.