విధుల్లో నిర్లక్ష్యం వహించిన కానిస్టేబుల్ సస్పెండ్
నిజాంసాగర్ జూన్ 4 ప్రజా జ్యోతి
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నాడని నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ మోహన్ సింగ్ ను కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర బుధవారం సస్పెండ్ చేశారు. కానిస్టేబుల్ విధుల్లో నిర్లక్ష్యం వహించడమే కాకుండా నైతికంగా ప్రవర్తించాడని తన దృష్టికి రావడంతో బుధవారం కానిస్టేబుల్ మోహన్ సింగ్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. కాగా కామారెడ్డి జిల్లా ఎస్పీ ఇప్పటివరకు ఆరుగురు పోలీసులపై సస్పెన్స్ వేటు వేశారు. సస్పెండ్ వేటు వేసిన వారిలో ఇద్దరు ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్, హోంగార్డులు ఉన్నారు. పోలీస్ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఈ సందర్భంగా హెచ్చరించారు.