నాగిరెడ్డిపేట్,ప్రజాజ్యోతి
మంజీరా వాగులో గేదెల కోసం వెళ్లి ప్రమాదవశాత్తు నీటమునిగి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని చీనూర్ గ్రామంలో చోటుచేసుకుంది.ఎస్సై మల్లారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఏనుగండ్ల మొగులయ్య(47) తన యొక్క గేదెలను మంజీరా వాగు శివారులో శుక్రవారం మధ్యాహ్నం మేత మెపడానికి తీసుకువెళ్లాడని, ఆగేదెలు మేతకోసం కుర్తివాడ గ్రామ శివారులోకి వెళ్లగా గేదెలను ఇంటికి రప్పించడం కొరకు మంజీరా వాగును దాటే క్రమంలో లోతు తెలియక నీట మునిగాడని,బయటికి రాకపోవడంతో గమనించిన కుటుంభ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శనివారం గ్రామస్థులైన రోని గోపాల్,మ్యాకల పౌలు రాజ్ లతో మంజీరావాగులో వెతకగా మొగులయ్య వాగులో శవమై తేలాడు,మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదులో పేర్కొన్నారు. భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మల్లారెడ్డి తెలిపారు.